Ad Code

Business: అమెరికా షెట్‌డౌన్..! భారత్‌ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపనుందా..?


అమెరికా ప్రభుత్వం షెట్‌డౌన్ అవుతుందా..? అనే ప్రశ్న ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయం అవుతుంది. దీంతోపాటు షెట్‌డౌన్ అయ్యే పరిస్థితీలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజంగా జరిగితే.. భారత్ స్టాక్ మార్కెట్‌ మీద ప్రభావం పడుతుందా..? అని చాలామంది ట్రేడర్లు ఆలోచనలో పడ్డారు. ఈ విషయం తెలుసుకోవడానికి అసలు అమెరికా ప్రభుత్వం షెట్‌డౌన్ కావడం అంటే ఏంటి..? అసలు ఎందుకు షెట్‌డౌన్ అవుతుంది..? దీనివల్ల ఏం జరుగుతుంది..? అనే విషయాలు తెలుసుకోవాలి.

ఫెడరల్ ప్రభుత్వం షెట్‌డౌన్ అంటే..

ప్రతి దేశానికి ఆర్థిక సంవత్సరం ఉంటుంది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం అక్టోబరు 1 తేదీ ప్రారంభమయ్యి.. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30న ముగుస్తుంది. భారతదేశం లాగానే అమెరికా పార్లమెంటులో కూడా రెండు హౌసులు ఉంటాయి. ఇందులో అక్టోబర్ 1వ తేదీ లోపు ఫెడరల్ ప్రభుత్వం, ఆర్థిక సంవత్సరానికి గాను తయారు చేసిన బడ్జెట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి. దాన్ని రెండు హౌసులు అంగీకరించాల్సి ఉంటుంది. అలా అంగీకరించిన బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆమోదించాలి. ఒకవేళ అలా రెండు హౌసులు బిల్లుకు అంగీకరించని పక్షంలో ఫెడరల్ ప్రభుత్వం షెట్‌డౌన్ అవుతుంది.

ఇందులో ఏం జరుగుతుంది..?

ఒకవేళ ఫెడరల్ ప్రభుత్వం షెట్‌డౌన్ అయితే.. రెండు హౌసులు బిల్లును అంగీకరించే వరకు ఫెడరల్ ప్రభుత్వం షెట్‌డౌన్‌లోనే ఉంటుంది. అవి రెండు అంగీకరించి బిల్లు పాస్ చేసే వరకు ఫెడరల్ ప్రభుత్వంలో పని చేసే లక్షలాది ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ సమయానికి గాను జీతాలు ఇవ్వరు. దీనికి తోడు చాలామంది ఉద్యోగులను కూడా ఉద్యోగంలో నుంచి తీసేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇలా అయితే.. భారత్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం


అక్టోబర్ 1వ తేదీ లోపు సడ్మిట్ చేయాల్సిన బిల్లు ఇప్పటి వరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దీనికి కారణం అమెరికాకు 2 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ లోటు ఉండడం. దీనివల్ల అమెరికా షెట్‌డౌన్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇలా జరిగితే.. ఈ సమయంల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావు. దీంతో వారు దాచిపెట్టుకున్న సేవింగ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపయోగిస్తారు. దీనివల్ల అమెరికా స్టాక్ మార్కెట్‌ మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాదు, అమెరికా ప్రజలు భారత్‌ స్టాక్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు తిరిగి తీసుకోవడానికి ఆస్కారం లేకపోలేదు. ఇలా జరిగితే భారత్ స్టాక్ మార్కెట్‌పై కొంత ప్రభావం పడుతుంది. కానీ, అక్టోబర్ 1న ఆదివారం కావడం, మరుసటి రోజు గాంధీ జయంతి సందర్భంగా భారత్ స్టాక్ మార్కెట్‌ సెలవు ఉండడంతో ఎక్కువ ప్రభావం పడదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభావం పడినా.. అది కొన్ని రోజులు మాత్రమేనని చెబుతున్నారు. ఒకవేళ ఈ షెట్‌డౌన్ ఎక్కువ రోజులు కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద, ఫెడరల్ రిజర్వ్‌ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది ఇతర దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Post a Comment

0 Comments