ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో వండటం రానివారు, వండే టైం లేని వారు కావాల్సినప్పుడు ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. వేడివేడిగా నోరూరించేలా ఉందని మనం లాగించే ఆహారం తాజాగా వండినదేనా? లేక మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసి తెస్తున్నారా? అని ఎప్పుడైనా ఆలోచించారా? మైక్రోవేవ్‌లో వేడి చేసినా ఫర్వాలేదు అనుకుంటున్నారా.. ఇందులో వేడి చేసిన ఆహారం కొంతవరకు ఫర్వాలేదు. కానీ ఫుడ్‌ని సాధారణ ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి వేడి చేయడం వల్ల దాని వేడికి ప్లాస్టిక్ కరిగి మైక్రాన్ రూపంలో ఆహారంలో కలుస్తుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా మైక్రోవేవ్‌లో వండటం వల్ల ఆహారంలో పోషక విలువలు నశిస్తాయని ఆహార నిపుణులు బలంగా హెచ్చరిస్తున్నారు.
మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పాత్రలు వాడడం వల్ల నష్టాలు
* వీటిలో ఉండే రసాయనాల వల్ల చిన్నపిల్లల్లో రక్తపోటు పెరగడానికి, రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతాయి. దీంతో డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
* సంతానోత్పత్తి సమస్యలు, ఆస్తమా, ఏడీహెచ్‌డీలకు కూడా దారి తీయవచ్చు.
* ప్లాస్టిక్‌లో వాడే బిస్ఫీనోల్ రసాయనాల వల్ల హారోన్లలో అసమతుల్యత ఏర్పడి అనేక అనారోగ్య సమస్యలకి దారిస్తాయి.
* బ్రాంకైటిస్, జన్యు మార్పులు, చర్మ వ్యాధులు, వినికిడి సమస్యలు, దృష్టి లోపాలు, అల్సర్లు, గుండె పనితీరులో లోపాలు వంటివి రావొచ్చు.
* ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్ వల్ల కాలేయం దెబ్బతింనడంతో పాటు.. యుక్తవయస్సు ప్రారంభంలోనే క్యాన్సర్ సమస్యను సైతం ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
0 Comments