Ad Code

Sports News: రేపటి నుంచి ప్రపంచ కప్.. హిట్ మ్యాన్ రికార్డులు

world cup 2023 news


వన్డే వరల్డ్‌ కప్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. రేపు ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ మధ్య మొదటి మ్యాచ్‌ జరగనుంది. ఇంకా అన్ని జట్లు ఈ మెగా టోర్నీకి సిద్ధం అయ్యాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ప్లేయర్లు రెడీ అయ్యారు. తమ ఫేవరేట్‌ బ్యాటర్ల నుంచి సెంచరీల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఓ లుక్కేద్దాం. ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో 5 సెంచరీలు చేసి తన పేరుతో రికార్డును నెలకొల్పారు. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన శ్రీలంక లెజెండ్‌ సంగక్కర రికార్డును హిట్‌ మ్యాన్‌ అధిగమించారు. 2015 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించారు. దీనిలో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక 2019లో జరిగిన ప్రపంచకప్‌లో హిట్‌ మ్యాన్‌ తన ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తన బ్యాటింగ్‌తో బౌలర్లను ఊచకోత కోశారు. మొత్తం 9 మ్యాచ్‌లలో 5 సెంచరీలు చేసి రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు. ఇందులో హ్యాట్రిక్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో 81 సగటుతో 648 పరుగులు చేశారు. వీటిలో 14 సిక్స్‌లు, 67 ఫోర్లు ఉన్నాయి.


రోహిత్‌ శర్మ వన్డే ప్రపంచకప్‌లో 17 మ్యాచ్‌లలో 978 పరుగులు చేశారు. ప్రస్తుతం ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లలో మూడో స్థానంలో ఉన్న గంగూలీ ప్రపంచకప్‌లో 1007 పరుగులు చేశారు. ఇప్పుడు ఈ రికార్డ్‌ను బ్రేక్‌ చేయడానికి హిట్‌ మ్యాన్‌ కేవలం 29 పరుగులు వెనుకబడి ఉన్నారు. అలాగే ప్రపంచకప్‌లో 6 సెంచరీలు చేసిన సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును రోహిత్‌ శర్మ సమం చేశారు. ఇంకో సెంచరీ చేస్తే సచిన్‌ రికార్డును హిట్‌ మ్యాన్‌ బ్రేక్‌ చేస్తారు. అలాగే మరో. 22 పరుగులు చేస్తే వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ నిలుస్తారు


వన్డేల్లో రోహిత్‌ శర్మకు మంచి రికార్డులు ఉన్నాయి. వన్డే ఇంటర్‌నేషన్‌లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా హిట్‌ మ్యాన్‌ నిలిచారు. 


*వవ్డే మ్యాచ్‌లలో హిట్‌ మ్యాన్‌ అత్యధిక స్కోర్లు 


రన్స్‌           ప్రత్యర్థి జట్టు             సంవత్సరం


264           శ్రీలంక                     2014


209           ఆస్ట్రేలియా             2013


208*         శ్రీలంక                     2017




2019 వరల్డ్‌ కప్‌లో హిట్‌ మ్యాన్‌ పరుగులు


ప్రత్యర్థి                       పరుగులు                    


సౌత్‌ ఆఫ్రికా                122*


ఆస్ట్రేలియా                 57


పాకిస్థాన్‌                    140


అఫ్గానిస్థాన్‌                1


వెస్టిండీస్‌                   18


ఇంగ్లాండ్‌                   102


బంగ్లాదేశ్‌                   104


శ్రీలంక                        103




రోహిత్‌ శర్మకు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఆయన కెప్టెన్సీలో ఆసియా కప్‌, నిదాహాస్‌ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. ఇప్పుడు భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా రోహిత్‌ సేన టైటిల్‌ సాధించేందుకు సిద్ధమైంది.

Post a Comment

0 Comments