1) గోల్కొండ కోట
Golconda Fort Hyderabad |
ఎంతో పురాతనమైన కట్టడాలలో గోల్కొండ కోట ఒకటి నాలుగు వేరు వేరు ప్రదేశాలను కలుపుతూ కట్టిన కట్టడమే ఈ గోల్కొండ కోట సుమారు 1143 సంవత్సరంలో కుతుబ్ షాహీ ఈ కోటని నిర్మించాడు మొదట దీనిని మంకాల్ అని పిలిచేవారు.
గోల్కొండ కోటలో చూడవలసిన ప్రదేశాలు:
- చప్పట్ల ప్రదేశం
- శవ స్నానాల గది
- ఎల్లమ్మ దేవి ఆలయం
- రామదాసు చెరసాల
- బారాదరి
- సౌండ్ & లైట్ షో
సందర్శించే సమయం : 9:00 AM to 5:00 PM
టికెట్ ధర : వేరే దేశస్థులుకు ₹200 , పెద్దలకు ₹25 (15years లోపు పిల్లలకు ఉచిత )
2) చార్మినార్
Charminar Hyderabad |
హైదరాబాద్ లో అతి ప్రాచీనమైన మరో కట్టడం చార్మినార్ సుమారు 400 ఏళ్ల కిందట దీనిని నిర్మించారు నాలుగు పిల్లర్లతో భాగ్యనగరానికి మధ్యలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. చార్మినార్ కి కొద్దిగా దూరంలోనే సాలార్ జంగ్ మ్యూజియం ఉంది అది కూడా తప్పకుండ సందర్శించండి అక్కడ మీరు మన పురాతనమైన వస్తువులను చూడవచ్చు ( సందర్శించే సమయం 10:00 AM to 5:00 PM )
చార్మినార్ సందర్శించే సమయం : 9:30 AM to 5:30 PM
టికెట్ ధర : వేరే దేశస్థులుకు ₹100 , పెద్దలకు ₹5
3) రామోజీ ఫిలిం సిటీ
Ramoji Film City Hyderabad |
ఈటీవీ అధినేత రామోజీరావు గారు నిర్మించిన ఫిలింసిటీ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు, ఎదుకంటే అన్ని దేశాలను మనం ఇక్కడే చూడవచ్చు అలాగే ఎన్నో ప్రదేశాలను ఇక్కడ నిర్మించారు ముఖ్యంగా షూటింగ్ ల కోసం వేరే దేశాలకు వెళ్లకుండా నిర్మాతలకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది బాహుబలి , RRR లాంటి పెద్ద మూవీని రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తి చేసారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండ రామోజీ ఫిలిం సిటీ ని చూడండి దీనితో పటు ఫిలిం సిటీలోని అడ్వెంచర్ పార్క్ ని కూడా చూడండి.
సందర్శించే సమయం : 9:00 AM to 5:30 PM
టికెట్ ధర : పెద్దలకు ₹1350 పిల్లలకు ₹1150
4) హుస్సేన్ సాగర్
Hussain Sagar Lake Hyderabad |
హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్దిని విగ్రహం చుట్టూ నీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఒకప్పుడు భాగ్యనగరం తాగు నీటి కోసం నిర్మించుకున్న ఈ సరస్సు క్రమేణా మురికినీరు ఈ సరస్సులో కలవడం వలన నీరు కలిసితం అయిపోయింది. హుస్సేన్ సాగర్ లో బోటింగ్ చాల బాగుంటుంది, సాగర్ లేక్ తో పాటు లుంబిని పార్క్ , NTR గార్డెన్ , బిర్లా మందిర్ , బిర్లా మందిర్ మ్యూజియం తప్పకుండ చూడండి, హుస్సేన్ సాగర్ కు 200mtrs to 400mtrs దూరంలోనే ఉంటాయి.
సందర్శించే సమయం : 8:00 AM to 10:00 PM
టికెట్ ధర : పెద్దలకు ₹55
NTR |
Birla Mandir |
Ambedkar Statue |
5) స్నో వరల్డ్
Snow World Hyderabad |
హైదరాబాద్ లో ప్రతి రోజు మంచు పడే ఏకైక ప్రదేశం స్నో వరల్డ్ ప్రపంచంలోనే 3 వదిగా భారతదేశంలోనే మొదటిగా నిర్మించిన అద్భుతమైన మంచు పర్యాటక ప్రదేశం ఇది. ప్రతి రోజు 3 టన్నుల తాజా మంచును ఉపయోగిస్తారు, ఎటువంటి హానికరం కాలుష్యం లేకపోవడం దీని ప్రత్యేకత. ఐస్ బోర్డింగ్ , ఐస్ స్కేటింగ్ , బంపింగ్ కార్‌తో మంచు స్లైడ్‌లు మరెన్నో ఇక్కడ ఉంటాయి మంచి ఎంజాయ్ చేసే ప్రదేశం తప్పకుండ సందర్శించండి.
సందర్శించే సమయం : 9:00 AM to 5:30 PM
టికెట్ ధర : పెద్దలకు ₹650 పిల్లలకు ₹500
6) వండర్ లా
Wonderla Hyderabad |
వండర్ లా అమ్యూజ్‌మెంట్ వాటర్ పార్క్ ఎంతో వినోదమైన ప్రదేశం ఇక్కడ గేమ్స్ , వాటర్ డ్రై రైడ్స్ , వాటర్ రైడ్స్ మరియు ఎన్నో ఆనందించే ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి సరదాగా ఫ్యామిలీతో గడిపే మంచి ప్రదేశం.
సందర్శించే సమయం : 11:00 AM to 7:00 PM
టికెట్ ధర : పెద్దలకు ₹1312 పిల్లలకు ₹1050
7) చిలుకూరు బాలాజీ టెంపుల్
Chilukuru Balaji Temple |
హైదరాబాద్ లో పురాతన దేవాలయాలలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒకటి , ఈ దేవాలయాన్ని భక్త రామదాసు మేనమామలు అయన మాదన్న అక్కన్నల కాలంలో ప్రతిరోజూ తిరుమలను దర్శించే ఒక భక్తుడు నిర్మించాడు, ఒకానొక కాలంలో ఆ భక్తుడు అవస్థతో బాధపడుతుండగా ఆ వేంకటేశ్వరుడు కలలో కనిపించి నా విగ్రహం తో పాటు శ్రీదేవి భూదేవి విగ్రహాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించామని ఆదేశించాడు ఆలా ఈ దేవాలయాన్ని ఆ భక్తుడు నిర్మించాడు. ఎవరైతే తిరుపతిని సందర్శించ లేక ఇబ్బందిపడుతుంటారు వాళ్లకు తన అనుగ్రహం పొందాలని శ్రీ బాలాజీ వేంకటేశ్వరుడు ఇక్కడ వెలిసాడు. మొదట భక్తులు వాళ్ళ కోరికను తీర్చమని ఆ భగవంతుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మొక్కుతారు ఆ తరువాత కోరికలు తీరక 101 ప్రదక్షిణలు చేసి మొక్కును తీర్చుకుంటారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను తీర్చమని ఆ భగవంతుని మొక్కుతారు. బాలాజీ టెంపుల్ కి వెళ్ళేటపుడు మీకు లోటస్ టెంపుల్ (శ్రీ కృష్ణుని దేవాలయం) కూడా ఉంటుంది తప్పకుండ సందర్శించండి.
సందర్శించే సమయం : 05:00 AM to 8:00 PM
టికెట్ ధర : ప్రవేశం ఉచితం
8) నెహ్రు జూలోజికల్ పార్క్
Zoo Park Hyderabad |
సందర్శించే సమయం : 08:00 AM to 5:00 PM (సోమవారం సెలవు)
టికెట్ ధర : పెద్దలకు ₹60 పిల్లలకు ₹40
వీడియో కెమెరా : ₹600
మొబైల్ ఫోన్ : ₹120
ట్రైన్ ధరలు : పెద్దలకు ₹20 పిల్లలకు ₹10
9) జగన్నాథ్ ఆలయం:
Jagannatha Temple BanjaraHills Hyderabad |
ఈ ఆలయం బంజారాహిల్స్ రోడ్ no 12 లో ఉంది ఈ ఆలయాన్ని 2009 లో కళింగ కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు ఈ ఆలయం లో జరిగే రథ యంత్ర చాల అద్భుతంగా ఉంటుంది ఈ యాత్రలో వేలాది మంది భక్తులకు పాల్గొంటారు ఈ ఆలయాన్ని పూరి లోని జగన్నాథ దేవాలయం నకు ప్రతిరూపంగా భావిస్తారు ఈ ఆలయం యొక్క శిఖరం ఎత్తు సుమారు ౭౦ అడుగులు ఉంటుంది ఈ ఆలయం కట్టడానికి అవసరం అయిన రాయని (600 టన్నులు) ఒడిశా నుంచి తెచ్చారు.
సందర్శించే సమయం ఉదయం : 06:00 AM to 12:00 PM
సాయంత్రం : 05:00 PM to 09:00 PM
టికెట్ ధర : ప్రవేశం ఉచితం
10) తీగల వంతెన
Cable Bridge Hyderabad |
0 Comments