Ad Code

Chandrayan 3 News: చంద్రుని ఉపరితలం పై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ ని సెల్ఫీ వీడియో తీసిన విక్రమ్ ల్యాండర్

chandrayan 3 rover video

నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో జులై 14 న చంద్రయాన్ 3 ని నింగిలోకి ప్రయోగించింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చంద్రయాన్ 3 వేరే దేశాల కంటే 50 శాతం ఖర్చుతో తయారు చేసింది, అన్ని దేశాలు దక్షిణ ధ్రువం పై ల్యాండ్ చేయడానికి భయపడితే ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువం పై లాండింగ్ చేసి విజయం సాధించింది. 41  రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి ఆగస్టు 23 సాయంత్రం 6:04pm  న చండ్రనిపై ల్యాండ్ అయింది. చంద్రుని ఉపరితలం పై అడుగు పెట్టి 140 కోట్ల మంది భారతీయలు కళను నెరవేర్చింది.

ప్రజ్ఞాన్ రోవర్:

విక్రమ్ ల్యాండర్ లోని అధిక రిజల్యూషన్ కెమెరా ద్వారా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలం పై అడుగుపెట్టే వీడియోని ఇస్రో ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ వీడియో లో విక్రమ్ ల్యాండర్ లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ర్యాంప్ మీదగా నెమ్మదిగా జారుతూ జాబిల్లి పై అడుగు పెట్టడాన్ని మనం గమనించ వచ్చు. ప్రజ్ఞాన్ రోవర్ పై మన జాతీయ చిహ్నాలు మరియు జాతీయ జెండాను చూడవచ్చు. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది అని ఇస్రో చెబుతుంది. రోవర్ 10 రోజులు పాటు చంద్రుని పై పరిశోధించునట్లు ఇస్రో చెబుతుంది.

ప్రజ్ఞాన్ రోవర్ లాండింగ్ వీడియో: 


 వీడియోతో పాటు చంద్రయాన్ - 2 పైనుంచి పంపించిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఫొటోస్ ని చూడవచ్చు 

దీనిని బట్టి చంద్రయాన్ 2 విఫలం కాలేదు అని చెప్ప వచ్చు చంద్రయాన్ 2 చంద్రుని పై అడుగు పెట్టక పోయిన చంద్రుని కక్షలో తిరుగుతూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
Chandrayaan-3 Lander and rover Photo


Post a Comment

0 Comments