Ad Code

Health Tips: ఈ మూడు రకాల జ్యూస్ లు త్రాగడం వలన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

health tips in telugu 

రోజు రోజుకి మనం తినే ఆహారం లో ఎన్నో మార్పులు మనమంతా ఇప్పుడు జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయాము ఇంట్లో కంటే బయటే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నాము ముఖ్యముగా పట్టణాలలో జీవించేవారు. అందుకే ఇంతకముందు కంటే ఇప్పుడు హోటళ్ళు మరియు రెస్టారంట్లు ఎక్కువ అయిపోయాయి. వీటితో పాటు ఆన్లైన్ డెలివరీ అప్స్ స్విగ్య్ , జొమాటో వలన ఇంటికే డెలివరీ చేయడం వలన మనకు తెలియకుండానే బయట ఆహారానికి అలవాటు పడిపోయాము.   బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలను ఎక్కువ గా ఎదురుకోవాల్సి వస్తుంది వీలైనంత వరకు బయట ఆహారాన్ని తగ్గించుకుంటూ ద్రవపదర్దాలు కలిగిన జ్యూస్ లు ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా క్రింద చెప్పిన జ్యూస్ లు త్రాగడం వలన మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ తో పాటు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. 

1) బీట్రూట్ జ్యూస్ :


  1. ఈ జ్యూస్ ఉదయాన్నే పరగడుపున త్రాగడం వలన శరీరానికి ఎంతో మంచిది
  2. శరీరంలో రక్తం ఉత్త్పత్తి తయారుఅవుతుంది 
  3. శక్తిని ఉత్సహాన్ని ఇస్తుంది 
  4. బరువు తగ్గటంలో ఎంతో ఉపయోగపడుతుంది 

2) క్యారెట్ జ్యూస్ :

                                      

తీయ్యగ వుండే అతి తక్కువైనా కూరగాయలలో క్యారెట్ ఒకటి ఈ జ్యూస్ త్రాగడం వలన మన శరీరానికి విటమిన్లు , ఖనిజ లవణాలను అందిస్తుంది కాన్సర్ గుండె జబ్బులు వంటివి రాకుండా చూస్తుంది. క్యారెట్లో విటమిన్ A ,B ,C ,E లతో పాటు ఐరన్ , మెగ్నీషియం , పొటాషియం అయాన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. క్యారెట్ ని మనం వంటకం గాను , జ్యూస్ గాను మరియు పచ్చిగాను తింటాము.

క్యారెట్ జ్యూస్ త్రాగడం వలన ఉపయోగాలు:

  1. కళ్ళకు చాల మంచిది కంటి సమస్యలు దూరమౌతాయి 
  2. రక్తపోటును తగ్గిస్తుంది
  3. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది 
  4. జుట్టు రాలె సమస్యను తగ్గిస్తుంది 
  5. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది 
  6. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది 
  7. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది 

క్యారెట్ ను మనం రోజు తినే ఆహారంలో తీసుకొవడం చాల మంచిది.

3) ఉసిరి జ్యూస్ :

                                     

ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా నివారించడంలో ఉసిరి చాల అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిని జ్యూస్ గా తీసుకోవడం వలన ఎన్నో లాభాలను పొందవచ్చు, ఉసిరి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది, మన శరీరాన్ని యవ్వనంగా కాంతి వంతంగా మార్చడంతో పాటు చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఉసిరిలో విటమిన్ c ఉండటం వలన అధిక బరువు సమస్యతో బాధపడే వారికి తగ్గించడంలో సహాయపడుతుంది. 

  1. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది  
  2. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది 
  3. కండరాల వ్యాధులను తగ్గిస్తుంది 
  4. మలబద్దకం సమస్యలను నివారిస్తుంది 
  5. మూత్రనాళ సమస్యలను తగ్గిస్తుంది 
  6. మధుమేహాన్ని తగ్గిస్తుంది 
  7. శరీరానికి శక్తిని ఇస్తుంది

ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఉసిరి జ్యూస్ చాల మంచిది

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది.

Post a Comment

0 Comments