Ad Code

లింగసముద్రం: వేలంలో రూ.40,000 పలికిన గణేష్ లడ్డూ

Lingasamudram jampalavaari palem ganesh
లింగసముద్రం: జంపాలవారి పాలెం గణేష్ నిమజ్జనం ఆదివారం జరుగుతుండగా లడ్డూ వేలం పాటను నిర్వహించారు, ఇందులో పలువురు గ్రామస్థులు వేలంలో పాల్గున్నారు. ఈ వేలంలో జంపాలవారి పాలెం గ్రామానికి చెందిన జంపాల మహేశ్వరరావు  రూ.40,000 కు లడ్డుని దక్కించుకున్నారు, వేలం అనంతరం మహేశ్వరరావు దంపతులు లడ్డుని తలపై పెట్టుకొని  స్వామివారికి ప్రదక్షణలు చేశారు.  ఇంతక ముందు సంవత్సరం (2022) కూడా లడ్డూ వేలంలో మహేశ్వరరావు రూ.40,000 కు దక్కించుకోవడం విశేషం. యువకులు గ్రామోత్సవమని ఉత్సహంగా నిర్వహించి అనంతరం గణనాథున్ని రాళ్ళపాడు ప్రాజెక్ట్ లో నిమజ్జనం చేస్తారు.


Post a Comment

0 Comments